అసెంబ్లీ సమావేశాలకు రెబల్ స్టార్ డుమ్మా,మాలాశ్రీతో కలిసి డ్యాన్స్ లు : వీడియో వైరల్| Oneindia Telugu

2017-11-15 2,772

Karnataka Congress party MLA Ambarish skips assembly session in Belgavi, seen dancing at a music launch in Bengaluru.

కర్ణాటకలో శీతాకాల శాసన సభా సమావేశాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని విధాన సౌదలో కాకుండా బెళగావిలోని సువర్ణ విదాన సౌధలో శాసన సభా సమావేశాలు జరుగుతున్నాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో సీబీఐ నమోదు చేసిన చార్జ్ షీట్ లో ఏ 1 ముద్దాయిగా ఉన్న మంత్రి కేజే. జార్జ్ రాజీనామా చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. శీతాకాల సమావేశాలు వాడి వేడిగా మూడో రోజూ జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, మండ్య నియోజక వర్గం ఎమ్మెల్యే, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ మాత్రం శాసన సభ సమావేశాలకు హాజరుకాకుండా ఓ కన్నడ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరై నవ్వులపాలైనారు.
బెంగళూరు నగరంలో ఉప్పు హుళి ఖార (ఉప్పు పులుపు కారం) కన్నడ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి మండ్య శాసన సభ్యుడు (కాంగ్రెస్), స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఇదే కార్యక్రమానికి ప్రముఖ నటి మాలాశ్రీ హాజరైనారు. ఉప్పుహుళి ఖార సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రెబల్ స్టార్ అంబరీష్, మాలశ్రీ, యాంకర్ అనుశ్రీతో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శాసన సభ సమావేశంలో పాల్గొని ప్రజల కష్టాల గురించి చర్చించకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీష్ ఇలా డ్యాన్సులు చెయ్యడం సిగ్గుగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. రూ. కోట్లు ఖర్చు పెట్టి శాసన సభా సమావేశాలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యేలు వారి సొంత పనులు చూసుకుంటూ సమావేశాలకు హాజరుకావడం లేదని విమర్శిస్తున్నారు.

Videos similaires